
ట్యాగ్ · 290 కథనాలు · పేజీ 9


అభిమానులతో శృతి హాసన్ చిట్ చాట్

"రాధేశ్యామ్ "మూవీ పై పూజాహెగ్డే కామెంట్స్

కిస్మస్ బరిలో 'ఆచార్య'..!

డిన్నర్ &ఖవ్వాలి ఎంజాయ్ చేసిన తమన్నా

స్ట్రాంగ్ మెసేజ్ తో వంశీ పైడిపల్లి - విజయ్

కాంబినేషన్ రిపీట్.. ముచ్చటగా మూడోసారి..!

'రాధేశ్యామ్' రిలీజ్ పై మరోసారి క్లారిటీ

మరో బిగ్ ఛాన్స్ కొట్టేసిన 'థమన్'

'భోళా శంకర్'ను మొదలుపెట్టే ప్లాన్ లో మెహర్ రమేష్

హీరో నాని పై షాహిద్ కపూర్ ప్రశంసలు

వర్షంలో సమంత సైకిల్ రైడ్

'సమంత'తో నటించాలని ఉంది

మాధవన్ 'రాకెట్రీ' రిలీజ్ డేట్ ఫిక్స్

"లవ్ స్టోరి" మూవీ US రికార్డ్

మహేష్ బాబు ట్వీట్ కు సాయి పల్లవి రీ ట్వీట్

'భవదీయుడు భగత్ సింగ్' దసరాకి ప్రారంభం

'లవ్ స్టోరీ' టీమ్ పై మహేష్ ప్రశంసలు

మరో ప్రేమకథ సిద్ధం చేస్తున్న శివ నిర్వాణ

బాలకృష్ణ తో సినిమా పక్కా..!
నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బి. గోపాల్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాలు వచ్చాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని ఎప్పటినుండో వార్తలు వచ్చాయి కానీ అవి వార్తల్లాగే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.

అభిమానులతో శృతి హాసన్ చిట్ చాట్
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి , శృతి జంటగా తెరకెక్కిన “లాభం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.శృతి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “సలార్”మూవీ కై శృతి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారు. సోషల్ మీడియా లో శృతి అభిమానులతో చిట్ చాట్…

2022, 2023 సంవత్సరాలలో నెంబర్ 1 స్టార్ గా ప్రభాస్
బ్లాక్ బస్టర్ "బాహుబలి "మూవీ తో ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందిన హీరో ప్రభాస్ స్టైలిష్ ఎంటర్ టైనర్ "సాహో" మూవీ తో బాలీవుడ్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా రూపొందే మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి. గోపీకృష్ణా మూవీస్ సమర్పణ లో యువి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజేహెగ్దే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్ “మూవీ 2002 సంవత్సరం జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

"రాధేశ్యామ్ "మూవీ పై పూజాహెగ్డే కామెంట్స్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పీరియాడికల్ లవ్‌స్టోరీ "రాధేశ్యామ్ " మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు ముఖ్య పాత్రలలో నటించారు. "రాధేశ్యామ్ " మూవీ హిందీ వెర్షన్‌కు మిథున్-మనన్ భరద్వాజ్, దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

కిస్మస్ బరిలో 'ఆచార్య'..!
పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ల విషయంలో ఇప్పటికే చాలా వరకూ క్లారిటీ వచ్చేసింది. ఏదో ఒకటి రెండు సినిమాల విషయంలో కాస్త ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా.. కొన్ని సినిమాలు అయితే రిలీజ్ డేట్లను సైతం ఫిక్స్ చేసుకున్నాయి. ఇక ఇంకా రిలీజ్ విషయంలో క్లారిటీ రాని సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కూడా ఉంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడకుండా ఉంటే ఆగష్ట్ లో ఈసినిమా రిలీజ్ అయి ఉండేది. అయితే అది కుదరలేదు. దీంతో దసరాకు అయినా ఈసినిమా రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో దసరా కు కూడా ఈసినిమా రిలీజ్ కాలేకపోతుంది. ఇక ఫైనల్ గా సంక్రాంతికే ఈసినిమాను…

డిన్నర్ &ఖవ్వాలి ఎంజాయ్ చేసిన తమన్నా
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు.తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. హిందీలో వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “F2 “ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

స్ట్రాంగ్ మెసేజ్ తో వంశీ పైడిపల్లి - విజయ్
తమిళంతో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉన్న నటుడు దళపతి విజయ్‌తో వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వంశీ పైడి పల్లి రీసెంట్ సినిమా మహర్షి. ఇందులో రైతుల సమస్యలు, వ్యవసాయం గురించి చెప్పాడు. ఇక ఈసినిమాకు గాను జాతీయ అవార్డును సైతం గెలుచుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. మరోవైపు విజయ్ కూడా దాదాపు ఈమధ్య అన్ని సినిమాలు మెసేజ్ ఒరియెంటెట్ సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కాబట్టి ఎలాంటి సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాంబినేషన్ రిపీట్.. ముచ్చటగా మూడోసారి..!
ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వడం కామన్ గానే చూస్తాం. కాంబినేషన్ కలిసొస్తే ఎన్ని సినిమాలు అయినా చేయడానికి రెడీ అయిపోతుంటారు. ఇక ఇక్కడ ఒక హిట్ కాంబినేషన్ కూడా అలానే చేస్తుంది. ఆ కాంబినేషన్ అజిత్-హెచ్ వినోత్-బోనీ కపూర్. అజిత్ హీరోగా హెచ్.వినోత్ దర్శకత్వంలో ఒక సినిమా చేశాడు. అదే నెర్కొండ పార్వాయి. ఈసినిమా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్. తమిళ్ లో బోనీ కపూర్ ఈసినిమాను నిర్మించాడు. ఈసినిమా తమిళ్ లో కూడా సూపర్ హిట్ అయింది. దీంతో మళ్లీ వీరికాంబినేషన్ లోనే వాలిమై సినిమాను సెట్ చేశారు.

'రాధేశ్యామ్' రిలీజ్ పై మరోసారి క్లారిటీ
కరోనా తరువాత థియేటర్లు తెరుచుకున్నా ప్రస్తుతానికి చిన్న సినిమాల నుండి ఓ మోస్తరు బడ్జెట్ సినిమాల వరకూ రిలీజ్ అవుతున్నాయి. అయితే పెద్ద సినిమాలు మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్లిపోయాయి. ఇందులో రాధేశ్యామ్ కూడా ఉంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా మళ్లీ వాయిదా పడబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. సినిమా అనుకున్న డేట్‌కే వస్తుందని, ఇతర ప్రభావాలు సినిమా విడుదలపై లేవని…

మరో బిగ్ ఛాన్స్ కొట్టేసిన 'థమన్'
ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే వెంటనే థమన్ ఎస్ అని చెప్పొచ్చు. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకూ అందరూ థమన్ నే సెలక్ట్ చేసుకుంటున్నారు. దానికితోడు థమన్ ఇస్తున్న ఆల్బమ్స్ కూడా అదే రేంజ్ లో వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మరీ ముఖ్యంగా అల వైకుంఠపురములో పాటలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవ్వడంతో థమన్ ఇంకా బిజీ అయిపోయాడు. పెద్ద సినిమాలకు అయితే మ్యాగ్జిమమ్ థమన్ నే తీసుకుంటున్నారు. దానితో పాటు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఆఫర్స్ కూడా చాలానే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో థమన్ ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. వకీల్ సాబ్…

'భోళా శంకర్'ను మొదలుపెట్టే ప్లాన్ లో మెహర్ రమేష్
మెగాస్టార్ చిరంజీవి లిస్ట్ లో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఆచార్య సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కూడా చాలా లేట్ అయింది. దీనితో పాటు గాడ్ ఫాదర్ సినిమా కూడా చేస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను దృష్టి పెట్టుకొని స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి గాడ్ ఫాదర్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొద్దిరోజులుగా ఊటీలో షూటింగ్ ను జరుపుకుంటుంది.

హీరో నాని పై షాహిద్ కపూర్ ప్రశంసలు
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ" మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో నాని ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "జెర్సీ "మూవీ గీతా ఆర్ట్స్ , దిల్ రాజు ప్రొడక్షన్స్ , సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కథానాయకుడి గా హిందీ రీమేక్ "జెర్సీ" తెరకెక్కుతుంది.

వర్షంలో సమంత సైకిల్ రైడ్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను కంప్లీట్ చేశారు. “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “శాకుంతలం ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత తన ఫ్రెండ్స్ తో హాలీడే ట్రిప్ కు గోవా వెళ్ళి ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'సమంత'తో నటించాలని ఉంది
సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత మొదటి సినిమాలోనే తన నటనతో మెప్పించింది. ఇక అప్పటినుండి ఇప్పటివరకూ తను కెరీర్ పరంగా రోజు రోజుకు దూసుకుపోతుందే తప్పా ఎక్కడా వెనుకడుగు వేసింది లేదు. ఇక పెళ్లైన తరువాత సమంత పూర్తిగా పాత్ర ప్రధానమైన.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనలోని విభిన్నత చూపిస్తుంది. ఇక స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత పలు రంగాల్లో కూడా తన సత్తా చాటుతుంది.

మాధవన్ 'రాకెట్రీ' రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రధాన పాత్రలో ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోపిక్‌గా వస్తున్న చిత్రం ‘రాకెట్రీ’. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కు సిద్దమైంది. కానీ కరోనా పరిస్థితులు కారణంగా ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ పై మాధవన్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతానికి థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. అందులోనూ నార్త్ లో ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. దీంతో ఈసినిమా అందరూ చూడాల్సిన సినిమా కాబట్టి థియేటర్లు అంతటా తెరుచుకున్న తరువాత ఈసినిమాను రిలీజ్ చేస్తామని మాధవన్ రీసెంట్ గా చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా…

"లవ్ స్టోరి" మూవీ US రికార్డ్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “లవ్ స్టోరి ” సెప్టెంబర్ 24 వ తేదీ రిలీజ్అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వసూళ్ళు రాబట్టిన తొలి చిత్రంగా "లవ్ స్టోరి" మూవీ నిలిచింది.

మహేష్ బాబు ట్వీట్ కు సాయి పల్లవి రీ ట్వీట్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “లవ్ స్టోరి ” మూవీ సెప్టెంబర్ 24 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో నాగ చైతన్య , సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

'భవదీయుడు భగత్ సింగ్' దసరాకి ప్రారంభం
వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ఆతరువాత వరుస సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈసినిమా అయిపోయిన వెంటనే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను పట్టాలెక్కించనున్నాడు. అయితే భీమ్లానాయక్ కంటే ముందే హరిహర వీరమల్లు సినిమా మొదలైంది. ఆ తరువాత రెండు సినిమాలను పార్లల్ గా చేస్తుండగానే కరోనా రావడంతో రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ తరువాత భీమ్లా నాయక్ సినిమాను ముందు రీస్టార్ట్ చేశారు. ఇక ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరగనుండగా త్వరలోనే షూటింగ్ ముగియనుంది. ఇక ఆ తరువాత హరిహర వీరమల్లు సినిమాను స్టార్ట్ చేయనున్నారు.

'లవ్ స్టోరీ' టీమ్ పై మహేష్ ప్రశంసలు
సినిమాలో మ్యాటరుంటే ఎన్నిరోజులు ఆలస్యమైనా సినిమాను ఆదరిస్తారమని లవ్ స్టోరీ సినిమాతో మరోసారి నిరూపించారు ప్రేక్షకులు. కరోనా సెకండ్ వేవ్ తరువాత చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ వాటిలో కొన్ని సినిమాలు కాస్త మంచి టాక్ ను తెచ్చుకున్నాయి కానీ చాలా వరకూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక అందరి ఎదురుచూపులకు తగ్గట్టే ఈనెల 24న రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ టాక్ తో దూసుపోతుంది. ఇక పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూనే మరోపక్క సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఈనేపథ్యంలో ఈసినిమా రిజల్ట్ చూసి ఇండస్ట్రీలో మేకర్స్ కాస్త ఊరట చెందుతున్నారు.

మరో ప్రేమకథ సిద్ధం చేస్తున్న శివ నిర్వాణ
ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే తమ మార్క్ ను చూపించి సక్సెస్ అవ్వగలుగుతారు. ఇక అలా వచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నిన్నుకోరి. నాని హీరోగా వచ్చిన ఈసినిమా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ కావడంతో హిట్ అందుకుంది. ఆ తరువాత నాగచైతన్యతో చేసిన మజిలీ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో నిర్వాణ టాప్ డైరెక్టర్ ప్లేస్ లోకి వెళ్లిపోయాడు. 'నిన్నుకోరి', 'మజిలీ' చిత్రాలలో చక్కటి ప్రేమకథను చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.