నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కత్తా నేపథ్యం లో తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి పల్లవి, కృతిశెట్టి , మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. హీరో నాని ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అంటే .. సుందరానికీ! మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. నజ్రియా నజీమ్ కథానాయిక.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వ శాఖ లో పనిచేసిన శ్రీకాంత్ దర్శకత్వంలో నాని హీరోగా సింగరేణి కోల్ మైనింగ్ నేపథ్యంలో సాగుతుందనీ , హీరో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారనీ సమాచారం. విజయదశమి సందర్భంగా ఈ నెల 15న ఈ సినిమా ప్రారంభం కాబోతుందని తెలుపుతూ నాని ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాకి సంబంధించిన వివరాలను శుక్రవారం మధ్యాహ్నం 1.53గంటలకు విడుదల చేయనున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: