సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా కారణంగా ఎప్పటికప్పుడు “ఆచార్య” మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడుతూనే ఉంది. పరిస్థితులు నార్మల్ గా ఉంటే దసరా సీజన్ లో ఆచార్య చిత్రం రిలీజ్ కావలసింది. చిత్ర పరిశ్రమకు థియేటర్స్, టికెట్ ధరల సమస్యలు ఉండడంతో ” ఆచార్య” దసరా రేసు నుంచి తప్పుకుంది.”ఆచార్య “చిత్ర యూనిట్ ఫిబ్రవరి 4, 2022న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. పవర్ ఫుల్ లుక్ లో చిరంజీవి , బ్యాక్ గ్రౌండ్ లో రామ్ చరణ్ ఉన్న ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: