నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే కరోనా సమయంలో నాని రెండు సినిమాలు రిలీజ్ చేసినా అవి రెండూ ఓటీటీలోనే రిలీజ్ చేశారు. ఇక ఈసారి మాత్రం థియేటర్ లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం నాని రెండు సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందులో శ్యామ్ సింగరాయ్ ఒకటి. రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ భారీగా ఉంటాయని ఇప్పటికే చెప్పారు. దీనికోసం ఎక్కువ సమయం పట్టనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక రీసెంట్ గా దసరా పండుగ సందర్బంగా ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా నుండి నాని ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశారు. వాసు అనే పాత్రలో నాని నటించనున్నాడు. ఇక ఈసినిమా నుండి తాజాగా సాలిడ్ అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈసినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేయనున్నారు.
This Christmas
Shyam will arrive where he belongs 🙂
To the big screen and to your hearts 🤍TELUGU,TAMIL,MALAYALAM,KANNADA
DECEMBER 24th 🔥#ShyamSinghaRoy @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @MickeyJMeyer @Rahul_Sankrityn @vboyanapalli@NiharikaEnt pic.twitter.com/pbMojsNhs8
— Nani (@NameisNani) October 18, 2021
కాగా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో సాయిపల్లవి కనిపించనుండగా ఇంకా కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కూడా నటిస్తున్నారు. ఇంకా రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. సను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: