న్యాచురల్ స్టార్ నాని మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. హిట్స్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన టక్ జగదీష్ సినిమా రిలీజ్ మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం నాని చేతిలో శ్యామ్ సింగ్ రాయ్, అంటే సుందరానికి సినిమాలు ఉన్నాయి. అందులోశ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అంటే సుందరానికి సినిమా మాత్రం షూటింగ్ దశలోనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టేశాడు నాని. విజయదశమి సందర్భంగా ఈ నెల 15న మధ్యాహ్నం 1.53గంటలకు ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని నాని తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన శ్రీకాంత్ ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్టు తెలుస్తోంది.
— Nani (@NameisNani) October 13, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: