మొత్తానికి ప్రభాస్ మాత్రం ఈసారి అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు. గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేయడానికే ఫిక్స్ అయినట్టున్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు లిస్ట్ లో ఉండగా రీసెంట్ గానే మరో సినిమాను కూడా ప్రకటించాడు. ప్రకటించడమే కాదు అదే స్పీడ్ లో షూటింగ్ లు కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఆది పురష్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు ప్రభాస్. ఇక దీనితో పాటు సలార్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకోగా ఇప్పుడు మూడో షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌లో మెజారిటీ భాగం భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అంతేకాదు ఈ ఒక్క షెడ్యూల్ కే చాలా బడ్జెట్ ను ఖర్చుచేయనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్ కు విలన్‌గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: