
ట్యాగ్ · 126 కథనాలు · పేజీ 6


మెగాస్టార్ రిలీజ్ చేయనున్న 'రిపబ్లిక్' ట్రైలర్

సెన్సార్ పూర్తిచేసుకున్న 'రిపబ్లిక్'

అనుకున్న డేట్ కే 'రిపబ్లిక్' రిలీజ్

థ్యాంక్యూ కలెక్టర్ తో "రిపబ్లిక్ " ప్రమోషన్స్

'టక్ జగదీష్' ట్రైలర్ రిలీజ్

"రిపబ్లిక్ " మూవీ లో ఐశ్వర్య రాజేష్ లుక్ రిలీజ్

"రిపబ్లిక్ " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

'రిపబ్లిక్' జగపతి బాబు లుక్ రిలీజ్

"గని" సెట్స్ లో సయీ మంజ్రేకర్

"అఖండ "లో అఘోర గా జగపతి బాబు ?

'హీరో' డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న జగ్గూభాయ్

మహేష్ మేనల్లుడికి సూపర్ రెస్పాన్స్

"రంగస్థలం "మూవీ తమిళ ట్రైలర్ రిలీజ్

'మహాసముద్రం' - రంభకు అభిమానిగా జగ్గూభాయ్

'రిపబ్లిక్' టీజర్ రిలీజ్

సూపర్ స్టార్ సినిమాలో జగ్గుభాయ్
'టక్ జగదీష్' టీజర్ రిలీజ్

'రిపబ్లిక్' ట్రైలర్ రిలీజ్
సాయి తేజ్ హీరోగా దర్శకుడు దేవ్ కట్టా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘రిపబ్లిక్’. ఇక ఈసినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇదిలా ఉండగా నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష అంటూ…

మెగాస్టార్ రిలీజ్ చేయనున్న 'రిపబ్లిక్' ట్రైలర్
సాయి తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో వస్తున్న సినిమా రిపబ్లిక్. ఇందులో కలెక్టర్ పంజా అభిరామ్ పాత్రలో సాయితేజ్‌నటించనున్నాడు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇటీవల బైక్ యాక్సిడెంట్‌లో గాయపడ్డ సాయితేజ్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే సాయి తేజ్ లేకపోయినా కూడా ఈసినిమాను అనుకున్న డేట్ కే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే చిత్రయూనిట్ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలను బ్రేక్ లేకుండా చేస్తున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా…

సెన్సార్ పూర్తిచేసుకున్న 'రిపబ్లిక్'
దేవ కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా నేపథ్యంలో వస్తున్న సినిమా రిపబ్లిక్. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే అర్థమైంది. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నేడు సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమాకి సెన్సార్ యూ / ఏ సర్టిఫికెట్ ను ఇచ్చారు. ఇక ఈవిషయాన్ని మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా చెబుతూ.. ఈ సినిమాని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు మరోసారి క్లారిటీ ఇచ్చారు.

అనుకున్న డేట్ కే 'రిపబ్లిక్' రిలీజ్
గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో సాయి తేజ్. ఈసారి పొలిటికల్ నేపథ్యంలో దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమాను అక్టోబర్ 1న రిలీజ్ చేయాలని ఎప్పుడో రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ ను మళ్లీ వాయిదా వేస్తారేమో అన్న వార్తలు వస్తున్నాయి. దానికి కారణం సాయి తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడమే. ప్రస్తుతం సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటుపడినా సినిమా రిలీజ్ ను వాయిదా వేయడమే బెటర్ అన్న ఆలోచనలు చేస్తున్నారన్న కథనాలు అయితే వస్తున్నాయి.

అమెజాన్ ప్రైమ్ లో "టక్ జగదీష్" రికార్డ్
నేచురుల్ స్టార్ నాని హీరోగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ వినాయక చవితి కానుకగాభారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్ వీడియో లో సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల , విమర్శకుల మిశ్రమ స్పందన పొందింది. ఉమ్మడి కుటుంబంలోని పరిస్థితులను, ఊరు సమస్యలను చక్కదిద్దే పౌరుడిగా నాని అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు.

థ్యాంక్యూ కలెక్టర్ తో "రిపబ్లిక్ " ప్రమోషన్స్
జీ స్టూడియోస్ సమర్పణలో జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “ప్రస్థానం”మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్ “మూవీ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1 వ తేదీ న రిలీజ్ కానుంది. అవినీతి సమాజం రాజకీయాలపై సీరియస్ డ్రామా నేపథ్యంలో రూపొందిన “రిపబ్లిక్”మూవీ లో జగపతి బాబు , రమ్య కృష్ణ కీలక పాత్రలలో నటించగా , సుబ్బరాజు , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'టక్ జగదీష్' ట్రైలర్ రిలీజ్
శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా టక్ జగదీష్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈసినిమా రిలీజ్ విషయంలో చాలా రోజుల కన్ప్యూజన్ తరువాత క్లారిటీ వచ్చింది. ముందు నుండి అనుకుంటున్నట్టే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ లో వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10 న స్ట్రీమింగ్ కానుంది.

"రిపబ్లిక్ " మూవీ లో ఐశ్వర్య రాజేష్ లుక్ రిలీజ్
జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “ప్రస్థానం”మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్ “మూవీ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1 వ తేదీ న రిలీజ్ కానుంది. అవినీతి సమాజం రాజకీయాలపై సీరియస్ డ్రామా నేపథ్యంలో రూపొందిన “రిపబ్లిక్”మూవీ లో జగపతి బాబు , రమ్య కృష్ణ కీలక పాత్రలలో నటించగా , సుబ్బరాజు , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"రిపబ్లిక్ " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "ప్రస్థానం"మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , ఐశ్వర్య రాజేష్ జంటగా పొలిటికల్ థ్రిల్లర్ "రిపబ్లిక్ "మూవీ తెరకెక్కింది. జగపతి బాబు , రమ్య కృష కీలక పాత్రలలో నటించగా , సుబ్బరాజు , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'రిపబ్లిక్' జగపతి బాబు లుక్ రిలీజ్
ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతిబాబు.. ఇప్పుడు విలన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండగా అందులో సాయి తేజ్ హీరోగా వస్తున్న ‘రిపబ్లిక్’ సినిమా కూడా ఒకటి. దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రిపబ్లిక్ సినిమా వస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమాను కూడా ఓటీటీలో రిలిజ్ చేస్తున్నట్టు వార్తలు రాగా ఖచ్చితంగా థియేటర్ల లోనే రిలీజ్ చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు.

"గని" సెట్స్ లో సయీ మంజ్రేకర్
సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కై వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ " దబాంగ్ 3" మూవీ ఫేమ్ సయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

"అఖండ "లో అఘోర గా జగపతి బాబు ?
దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

'హీరో' డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న జగ్గూభాయ్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా “హీరో”తో వెండితెర ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఈవిషయాన్ని జగ్గూభాయ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మహేష్ మేనల్లుడికి సూపర్ రెస్పాన్స్
టిడిపి ఎంపి గల్లా జయదేవ్, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరో గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా టైటిల్ టీజర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. హీరో అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా టైటిల్ టీజర్ కు మహేష్ బాబు రిలీజ్ చేయగా.. ఊహించని విధంగా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే టీజర్‌కు 4మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

"రంగస్థలం "మూవీ తమిళ ట్రైలర్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా”రంగస్థలం “మూవీ 2018 సంవత్సరం మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో ఆది పినిశెట్టి , జగపతి బాబు , అనసూయ ముఖ్యపాత్రలలో నటించగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

'మహాసముద్రం' - రంభకు అభిమానిగా జగ్గూభాయ్
శర్వానంద్ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో రేంజ్ అందుకున్న సిద్దార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. కాగా ఈసినిమాలో జగపతిబాబు కూడా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఈ చిత్రంలో జగ్గూభాయ్ రంభకు అభిమానిగా కనిపిస్తాడు. వైజాగ్ లో వేసిన సెట్‌లో జగ్గూభాయ్ పై ఓ పాటను షూట్ చేయగా..ఈ సాంగ్‌లో రంభ ఫొటోలు, ప్లెక్సీలు కనిపిస్తాయి. ఈ పాటలో శర్వానంద్ కూడా ఉంటాడు.

'రిపబ్లిక్' టీజర్ రిలీజ్
మెగాహీరో సాయి తేజ్ ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో సూపర్ ఫాంలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమాని టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈసారి లవ్ స్టోరీ కాకుండా కాస్త డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు. 'రిపబ్లిక్' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌తో పాటు పోస్టర్‌కి మెగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా సాయి తేజ్, రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ లను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. అవికూడా బాగా ఆకట్టుకున్నాయి.

సూపర్ స్టార్ సినిమాలో జగ్గుభాయ్
శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. ఇటీవలే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి కొద్దిరోజులు హైదరాబాద్ లో కూడా షూటింగ్ జరిపారు. అయితే అదే సమయంలో చిత్ర యూనిట్ లో కరోనా కలకలంతో షూటింగ్ కు బ్రేక్ వేశారు. ఆ తర్వాత రజినీకాంత్‌కి ఆరోగ్య సమస్య తలెత్తడంతో.. చెన్నై వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పటి వరకూ షూటింగ్ విషయంలో ఎలాంటి అప్ డేట్ లేదు.
'టక్ జగదీష్' టీజర్ రిలీజ్
న్యాచురల్ స్టార్ నాని.. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'టక్ జగదీష్'. 'నిన్ను కోరి' సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మొదలుపెట్టినప్పటినుండే అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్.. మోషన్ పోస్టర్ ఆ అంచనాలను ఇంకా పెంచేసింది. మరోసారి నాని-శివ తమ మ్యాజిక్ ను క్రియేట్ చేసేలా ఉన్నారన్న అభిప్రాయం ఏర్పడింది. క్లాస్ లుక్ లో మాస్ యాంగిల్ నాని యాక్షన్ సినిమాకు పెద్ద హైలైట్ అవ్వబోతుందని అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్ షురూ అయ్యాయి కూడా.
'రాబర్ట్' ట్రైలర్ రిలీజ్ - ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్
తరుణ్ కిషోర్ సుధీర్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో దర్శన్ హీరోగా 'రాబర్ట్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గా నే జగపతి బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ రోజు దర్శన్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.