‘రాబర్ట్’ ట్రైలర్ రిలీజ్ – ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్

Challenging Star Darshan Roberrt Movie Trailer Is Out Today,Roberrt Telugu Movie Trailer,Latest Telugu Trailers 2021,Latest Telugu Movie Trailers 2021,Roberrt Telugu Movie,Telugu Filmnagar,Roberrt,Robert Trailer,Robert Movie Trailer,Darshan,Vinnod Prabhakar,Asha Bhat,Jagapathi Babu,Ravi Kishan,Ravi Shankar,Robert Telugu Movie Trailer,Roberrt 2021 Telugu Movie,Roberrt Telugu Movie Trailer 4K,Actor Darshan,Latest Telugu Trailers 2021,Roberrt Telugu Movie Trailer,Roberrt Movie,Roberrt Film,Darshan Roberrt,Roberrt Darshan,Roberrt Trailer,Roberrt Trailer Out,Roberrt Trailer Released,Roberrt Trailer Telugu,Roberrt Movie Telugu Trailer,Challenging Star Darshan Roberrt Movie Trailer

త‌రుణ్ కిషోర్ సుధీర్ ద‌ర్శ‌క‌త్వంలో కన్నడ స్టార్ హీరో దర్శన్ హీరోగా ‘రాబర్ట్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గా నే జగపతి బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ రోజు దర్శన్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ ను చూస్తుంటే ఈ సినిమాను ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్టే కనిపిస్తుంది. డైలాగ్స్ అయితే పేలిపోతున్నాయి. హీరో, విలన్ ఇద్దరు క్యారెక్టర్స్ ను పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఎలివేట్ చేశారు. “నన్ను అంతం చేయాలనుకున్నవాడు నా కన్నా పెద్ద క్రిమినల్‌ బ్రెయిన్‌ అయ్యుండాలి… నా కన్నా టెర్రర్‌ అయ్యుండాలి.. నా కన్నా వైలెంట్ అయ్యుండాలి. అంతటి మగాడు ఈ భూమ్మీదున్నాడా.. హై కోయి.. ఉన్నాడా?” అన్న డైలాగ్ కు ఒకరి లైఫ్‌లో హీరో అవ్వాలనుకుంటే ఒకరి లైఫ్‌లో విలన్‌ అవ్వాల్సిందే”, “అరే తుతుంబర్‌ నువ్వు మాస్‌ అయితే నేను మాస్‌కే…” అంటూ దర్శన్‌ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. ఇక మనిషికి రెండుసార్లు వణుకు పుడుతుంది. ఒకటి చలి వేసినప్పుడు.. రెండు బాగా భయం వేసినప్పుడు” అనే డైలాగ్‌తో జగపతిబాబు క్యారెక్టర్‌ను పరిచయం చేశారు.

 

కాగా కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఉమాప‌తి ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస గౌడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా సమ్మర్ కానుకగా మర్చి 11న ఈ సినిమా విడుదల చేయనున్నారు. అర్జున్ జ‌న్యా సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్ర‌ఫీ సుధాక‌ర్ ఎస్‌.రాజ్‌ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 3 =