దేవ కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా నేపథ్యంలో వస్తున్న సినిమా రిపబ్లిక్. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే అర్థమైంది. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నేడు సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమాకి సెన్సార్ యూ / ఏ సర్టిఫికెట్ ను ఇచ్చారు. ఇక ఈవిషయాన్ని మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా చెబుతూ.. ఈ సినిమాని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు మరోసారి క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Much Awaited #Republic✊ is Censored with 𝕌/𝔸. Releasing in Theaters WORLDWIDE on October 1st 💥#RepublicFromOct1st@IamSaiDharamTej @aishu_dil @devakatta @meramyakrishnan @IamJagguBhai #ManiSharma @bkrsatish @JBEnt_Offl @ZeeStudios_ @ZeeMusicCompany @JBhagavan1 @j_pullarao pic.twitter.com/LO89A5kn0B
— JB Entertainments (@JBEnt_Offl) September 18, 2021
కాగా జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: