‘టక్ జగదీష్’ టీజర్ రిలీజ్

Natural Star Nani Tuck Jagadish Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tuck Jagadish Teaser,Nani,Ritu Varma,Jagapathi Babu,Thaman S,Shiva Nirvana,Shine Screens,Tuck Jagadish Teaser,Natural Star Nani,Tuck Jagadish Movie Teaser,Happy Birthday Nani,Nani Tuck Jagadish,Nani Tuck Jagadish Movie,Nani And Ritu Varma Movie,Tuck Jagadish First,Nani’s Tuck Jagadish Movie Teaser,Tuck Jagadish Movie Teaser Telugu,Tuck Jagadish Telugu Movie Teaser,Tuck Jagadish Teaser Update,Tuck Jagadish Teaser Out,Tuck Jagadish Teaser Released,Tuck Jagadish Teaser Is Out Now,Nani Tuck Jagadish Movie Teaser,Natural Star Nani Tuck Jagadish Teaser,Natural Star Nani Tuck Jagadish Teaser Out,Tuck Jagadish Teaser Telugu,Nani Tuck Jagadish Telugu Movie Teaser,#TuckJagadishTeaser

న్యాచురల్ స్టార్ నాని.. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘టక్ జగదీష్’. ‘నిన్ను కోరి’ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మొదలుపెట్టినప్పటినుండే అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్.. మోషన్ పోస్టర్ ఆ అంచనాలను ఇంకా పెంచేసింది. మరోసారి నాని-శివ తమ మ్యాజిక్ ను క్రియేట్ చేసేలా ఉన్నారన్న అభిప్రాయం ఏర్పడింది. క్లాస్ లుక్ లో మాస్ యాంగిల్ నాని యాక్షన్ సినిమాకు పెద్ద హైలైట్ అవ్వబోతుందని అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్ షురూ అయ్యాయి కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందేకదా. ఫిబ్రవరి 24న నాని పుట్టిన రోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే ఇక చెప్పినట్టే టీజర్ ను రిలీజ్ చేశారు. సాధారణంగా టీజర్ అంటే డైలాగులు ఉంటాయి.. ఇక టీజర్ విషయానికి వస్తే టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా పాటతోనే సినిమా ఎలా ఉంటుందో చూపించారు. సినిమా టైటిల్ కు తగ్గట్టే సినిమా మొత్తం టక్ తో ఉండేలా కనిపిసితున్నాడు నాని. షర్ట్ నలగకుండా మరీ యాక్షన్ సీన్స్ చేస్తున్నాడు. జగపతి బాబు-నాని మధ్య అన్నదమ్ముల్ల అనుబంధం కూడా బాగానే చూపించేలా కనిపిస్తుంది. మొత్తంగా టీజర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. నాని కూడా చాలా రోజుల తర్వాత పక్కా కమర్షియల్ మాస్ సినిమా చేస్తున్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

కాగా రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు. ఏప్రిల్ 23న ఈ సినిమా రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + thirteen =