జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “ప్రస్థానం”మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , ఐశ్వర్య రాజేష్ జంటగా పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్ “మూవీ తెరకెక్కింది. జగపతి బాబు , రమ్య కృష కీలక పాత్రలలో నటించగా , సుబ్బరాజు , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రిపబ్లిక్”మూవీ లో పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్ గా సాయి తేజ్ నటించారు. అవినీతి సమాజం రాజకీయాలపై సీరియస్ డ్రామా నేపథ్యంలో రూపొందిన “రిపబ్లిక్”మూవీ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1 తేదీ న రిలీజ్ కానుందని ఒక పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. సక్సెస్ ఫుల్ “సోలో బ్రతుకే సో బెటర్ “మూవీ తరువాత సాయి తేజ్ హీరోగా రూపొందిన “రిపబ్లిక్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: