
ట్యాగ్ · 126 కథనాలు · పేజీ 7


'దొంగాట' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
చిరు సినిమాలో జగ్గూభాయ్..?
పదివేల మందికి సాయం..!

2021.. డిఫరెంట్ రోల్స్ తో జగ్గూ భాయ్
ఒకప్పుడు కుటుంబకథా చిత్రాలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి...ఇప్పుడు విలన్ గా, ఫాథర్ గా దూసుకుపోతున్నాడు జగపతి బాబు. గతంలో ఫ్యామిలీ సినిమాలంటే జగపతిబాబు సినిమాలే గుర్తొచ్చేవి. ఆ తరువాత యంగ్ హీరోలు రావడం... సినిమా ఛాన్స్ లు తగ్గడం.. దానికి తోడు ఆర్ధిక సమస్యలు కూడా రావడంతో సరైన బ్రేక్ కోసం ఎదురుచూశాడు జగ్గూభాయ్. చాలా గ్యాప్ తర్వాత లెజెండ్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.. ఆ సినిమా హిట్టవ్వడంతో జగపతి బాబుకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఒకపక్క విలన్ పాత్రలు చేస్తూనే... మరోపక్క ఫాథర్ పాత్రలు కూడా చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో బెస్ట్ ఛాయిస్ గా మారిపోయాడు.
'లక్ష్య' టీజర్ రిలీజ్ - పడి లేచినవాడితో పందెం ప్రమాదకరం
యంగ్ హీరో నాగశౌర్య నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఇక ఈ సందర్భంగా నాగశౌర్య సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇప్పటికే వరుడు కావలెను సినిమా నుండి నాగ శౌర్య ఇంట్రడక్షన్ వీడియో ను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో సినిమా 'లక్ష్య' నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'దొంగాట' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
జగపతిబాబు, సౌందర్యలతో కోడి రామ కృష్ణ తీసిన ‘దొంగాట’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. గిలిగింతలు పెట్టే కామెడీ, కంటతడి పెట్టించే సెంటి మెంట్, మనసును తడిమే సన్నివేశాలు, చక్కని సంభాషణలు... అన్నీ కలిసి ‘దొంగాట’లో దర్శకుడిని విజేతగా నిలి పాయి. అమాయకమైన అమ్మాయిగా సౌందర్య నటన.. దొంగగా జగపతి బాబు నటన.. సౌందర్య ను మోసం చేసే పాత్రలో సురేష్ నటన ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు కాబట్టే సినిమా అంత గొప్ప విజయం దక్కించుంది. కోడి రామకృష్ణ అంటేనే కామెడీ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఈసినిమాలో కూడా కామెడీ అదే రేంజ్ లో ఉంటుంది. మరి ఆ సినిమానుండి కామెడీ సీన్స్ మీకోసం ...
చిరు సినిమాలో జగ్గూభాయ్..?
సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు. లెజెండ్ సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతిబాబు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ నిలిచాడు. ప్రస్తుతం అటు సీనియర్ హీరోల సినిమాల నుంచి, ఇటు యంగ్ హీరోల సినిమాల వరకూ అందరితో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. కేవలం విలన్ పాత్రలోనే కాక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. తెలుగు, తమిళం,మలయాళం, హిందీ భాషలలో నటిస్తున్నాడు జగ్గూభాయ్.
పదివేల మందికి సాయం..!
గుప్త దానాలు.. ఈ పేరు వినే వుంటారు కదా. అంటే మనం సాయం చేసినా పక్కన వాళ్ళకి తెలియకుండా ఉండటమే కదా దాని అర్ధం. ఇప్పుడు దీని గురించి ఎందుకంటే.. కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కష్టకాలంలో పేదలను ఆడుకోడానికి ఎంతో మంది సాయం చేయడానికి ముందుకొచ్చిన సంగతి కూడా విదితమే. సినీ ప్రముఖులు దగ్గరనుండి సామాన్య ప్రజల దాకా వారికి తోచినంత వారు తమ వంతు సాయం చేస్తున్నారు.

ది లయన్ కింగ్’ ఇండియన్ వెర్షన్స్‌కి ప్రముఖుల డబ్బింగ్
భావోద్వేగాలకు భాష అవసరం లేదు... మనసును తాకితే చాలు... ఆ సినిమాకి విజయం తథ్యం అని నిరూపించిన చిత్రాల్లో ‘ది లయన్ కింగ్’ ఒకటి. 1994లో విడుదలైన ఈ హాలీవుడ్ ఎపిక్ మ్యూజికల్ యానిమేటెడ్ మూవీని ఓ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌కి ఏ మాత్రం తీసిపోని విధంగా నిర్మించింది ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ పిక్చర్స్. చారిత్రక విజయం సాధించిన ఈ చిత్రాన్ని... మళ్ళీ ఇప్పుడు 25 ఏళ్ళ తరువాత ‘ది జంగిల్ బుక్’ దర్శకుడు జాన్ ఫేవరేవ్... ఇప్పటి తరం ప్రేక్షకుల కోసం ఫోటో రియలస్టిక్ లైవ్ యాక్షన్ యానిమేటెడ్ టెక్నాలజీతో 3D వెర్షన్‌లో తెరకెక్కించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జూలై 19న విడుదల కానుంది. కాగా…