శర్వానంద్ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో రేంజ్ అందుకున్న సిద్దార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. కాగా ఈసినిమాలో జగపతిబాబు కూడా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఈ చిత్రంలో జగ్గూభాయ్ రంభకు అభిమానిగా కనిపిస్తాడు. వైజాగ్ లో వేసిన సెట్‌లో జగ్గూభాయ్ పై ఓ పాటను షూట్ చేయగా..ఈ సాంగ్‌లో రంభ ఫొటోలు, ప్లెక్సీలు కనిపిస్తాయి. ఈ పాటలో శర్వానంద్ కూడా ఉంటాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. మరి అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత సన్సేషన్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి చిత్రం ఆర్ఎక్స్ 100 సినిమాతోనే పెద్ద సక్సెస్ కొట్టాడు అజయ్ భూపతి. లవ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సొంత చేసుకుంది. మరి ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: