జీ స్టూడియోస్ సమర్పణలో జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “ప్రస్థానం”మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్ “మూవీ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1 వ తేదీ న రిలీజ్ కానుంది. అవినీతి సమాజం రాజకీయాలపై సీరియస్ డ్రామా నేపథ్యంలో రూపొందిన “రిపబ్లిక్”మూవీ లో జగపతి బాబు , రమ్య కృష్ణ కీలక పాత్రలలో నటించగా , సుబ్బరాజు , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రిపబ్లిక్”మూవీ లో పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్ గా సాయి తేజ్ నటించారు. “రిపబ్లిక్”మూవీ ప్రమోషన్స్ మొదలుపెడుతున్న మేకర్స్.. “థాంక్యూ కలెక్టర్” అనే కొత్త ఇనిషియేటివ్ కి శ్రీకారం చుట్టారు. సరిహద్దుల్లో పోరాడే సైనికుల వీరగాధలు తెలుసుకున్నట్లే, సరిహద్దుల లోపల పోరాడే ధైర్యవంతులైన కలెక్టర్ల కథలను అందరికీ తెలియజేయాలని “రిపబ్లిక్” చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తాజాగా “థాంక్యూ కలెక్టర్” అనౌన్స్ మెంట్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ వీడియో లో సాయి తేజ్ మాట్లాడుతూ… విదేశీ శత్రువుల నుంచి మన దేశాన్ని కాపాడే సైనికులంటే మనకెంతో గౌరవం అనీ , వాళ్ళ వీరగాథలు ఎన్నో విన్నాం చూశామనీ , కానీ స్వదేశీ శత్రువులు మన వ్యవస్థ మీద చేసే అన్యాయాల దాడి నుంచి దేశాన్ని కాపాడటానికి ప్రతిరోజూ కలెక్టర్లు పోరాడుతూనే ఉన్నారనీ , ఆ పోరాటంలో జయించిన వారున్నారు, పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారనీ , అలాంటి బ్రేవ్ కలెక్టర్స్ ని గుర్తించి “థాంక్యూ కలెక్టర్” అనే ఇనిషియేటివ్ ద్వారా వారి కథల్ని మీ ముందుకు తీసుకురాబోతున్నామనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: