గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో సాయి తేజ్. ఈసారి పొలిటికల్ నేపథ్యంలో దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమాను అక్టోబర్ 1న రిలీజ్ చేయాలని ఎప్పుడో రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ ను మళ్లీ వాయిదా వేస్తారేమో అన్న వార్తలు వస్తున్నాయి. దానికి కారణం సాయి తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడమే. ప్రస్తుతం సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటుపడినా సినిమా రిలీజ్ ను వాయిదా వేయడమే బెటర్ అన్న ఆలోచనలు చేస్తున్నారన్న కథనాలు అయితే వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటున్నారు మేకర్స్. రిపబ్లిక్ ని నిర్మాతలు అనుకున్నట్లుగానే అక్టోబర్ 1న రిలీజ్ చేయాలని.. వాయిదా వేయాలని అస్సలు అనుకోవడం లేదని అంటున్నారు. సాయి తేజ్ మినహా అంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. అందువల్ల వాయిదా లేదని తెలుస్తోంది. దానికితోడు ఈసినిమా హక్కులన్నీ జీటీవీ సంస్థ దక్కించుకుంది. దీంతో జీ-సంస్థ రిలీజ్ కాబట్టి కార్పోరేట్ నిబంధంనల ప్రకారం రిలీజ్ చేయాల్సిందే తప్ప ఇతర కారణాలతో వాయిదా పడటానికి వీలుండదు అంటున్నారు.
కాగా జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: