'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ఫిక్స్
నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి సినిమా. ఇక అన్ని సినిమాల్లాగే ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఎప్పుడో రిలీజ్ కాావాల్సిన ఈ సినిమా ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది. నిజానికి గతేడాది ఏప్రిల్లో విడుదల కావాల్సిన సినిమా ఇది.. అప్పుడు కరోనా వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ జూన్ లో కూడా ఈసినిమా రిలీజ్ కాలేదు. ఈ క్రమంలోనే ఈసినిమాను ఓటీటీలో విడుదల చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆవార్తలపై మేకర్స్ కూడా స్పందించి ఈసినిమాను ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
పూర్తి వార్త చదవండి


















