శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. 26/11 ముంబై టెర్రర్ అటాక్‌లో అమరివీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఇటీవలే రీసెంట్ గా చివరి షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఆ షూటింగ్ పూర్తవ్వనుంది. దీంతో సమాచారం ప్రకారం ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా త్వరలో ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. దాని కోసం మంచి డేట్ ను చూస్తున్నారట మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే మేజర్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈసినిమా విజయంతో అడివి శేష్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: