ఫైనల్లీ దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ పై ఇన్నాళ్లకు క్లారిటీ వచ్చింది. పరిస్థితులు అన్నీ బావుంటే ఇప్పటికే సినిమా రిలీజ్ అయి ఉండేది. కానీ కరోనా వల్ల అది కుదరలేదు. కనీసం ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతుంది అనుకున్నారు కానీ సినిమా షూటింగ్ కూడా పూర్తికాకపోవడంతో ఈ ఏడాది కూడా పోస్ట్ పోన్ అయింది. అయితే గత కొద్ది రోజులుగా మళ్లీ ఈసినిమా రిలిజ్ డేట్ పై వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఈసినిమా రిలీజ్ అవుతుందో లేదో అని.. సమ్మర్ లో రిలీజ్ అవుతుందేమో అన్న వార్తలు మొదలయ్యాయి. ఇక ఈ కన్ఫ్యూజన్ లో ఉండగా సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. వచ్చే ఏడాది 2022 జనవరి 7వ తేదీన మూవీ విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Experience India’s Biggest Action Drama, #RRRMovie in theatres worldwide on 7th Jan 2022. 🤟🏻#RRROnJan7th 💥💥
An @ssrajamouli Film. @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies @PenMovies @jayantilalgada @LycaProductions pic.twitter.com/wKtnfeCJN7
— RRR Movie (@RRRMovie) October 2, 2021
కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మరి సంక్రాంతి బరిలో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. అన్ని సినిమాలు దాదాపు పెద్దవే. ఈనేపథ్యంలో ఆర్ఆర్ఆర్ తో పోటీ నుండి ఎవరైనా తప్పుకుంటారా లేక ఎలాగూ ఒక వారం గ్యాప్ ఉంటుంది చెప్పిన డేట్స్ కే రిలీజ్ చేస్తారా చూడాలి ఏం జరుగుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: