అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్పీ బ్యానర్స్ పై శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ , కషిష్ ఖాన్ జంటగా పేకాట కోడిపందాల నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ “అనుభవించు రాజా ” మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. పోసాని , అజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు. పక్కా గోదావరి స్లాంగ్ లో రాజ్ తరుణ్ పలికే డైలాగ్స్, ఆయన గెటప్ సినిమాకి హైలైట్ కాబోతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “అనుభవించు రాజా ” మూవీని నవంబర్ 26 న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత సుప్రియ మాట్లాడుతూ చిన్న సినిమాలే పరిశ్రమని కాపాడుతున్నాయనీ , అలాంటి చిన్న సినిమాల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదనీ , ఈ సినిమా రెండు గంటల పాటు నవ్విస్తూనే ఉంటుందనీ , అదే.. మాకు విజయాన్ని అందింస్తుందని నమ్మకం అనీ చెప్పారు. భీమవరం కుర్రాడి జీవితమే ఈ సినిమా అనీ , తన జీవితంలో ఎదురయ్యే సంఘటనలు నవ్విస్తాయనీ దర్శకుడు చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: