ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న హీరో ఆశిష్ రెడ్డి. ‘రౌడీ బాయ్స్’ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకునే పనిలో ఉంది. ఇక వారసుడి సినిమా కాబట్టి దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నాడు. ఈసినిమా ప్రమోషన్స్ కోసం మంచి క్రేజ్ ఉన్న హీరోలను సైతం దిల్ రాజు రంగంలోకి దించుతున్నాడు. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ లను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్సే వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు. ప్రేమే ఆకాశం అంటూ వచ్చే ఈపాటను రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నిజానికి ఈసినిమాను దసరా సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అది కుదరలేదు. ఇప్పుడు నవంబర్ 19న ఈసినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
కాగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: