కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా కొత్త చిత్రం ప్రారంభమయింది. ఇందులో స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఆయనకు జోడిగా నటిస్తోంది. షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకి ‘బైసన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ప్రముఖ డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ‘బైసన్’ లాంఛింగ్ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా మేకర్స్ మూవీ టైటిల్ లుక్ రిలీజ్ చేశారు. ఇది గమనిస్తే.. బ్యాక్ డ్రాప్‌లో ఒక అడవిదున్న కనిపిస్తుండగా, దాని ముందు ధ్రువ్ విక్రమ్ కండలు తిరిగిన దేహంతో రన్నింగ్‌కు సిద్ధంగా ఉండటం గమనించొచ్చు. ప్రస్తుతం ఈ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే తమిళ సంస్కృతిని ప్రతిబింబించే కథలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు మారి సెల్వరాజ్.. తొలిసారి తన సినిమాకు ఇంగ్లీష్ టైటిల్ పెట్టడం విశేషం.
కాగా తెలుగు బ్లాక్ బస్టర్ ‘అర్జున్ రెడ్డి’ తమిళ్ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ సినిమాతో తొలిసారిగా తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు ధ్రువ్ విక్రమ్. ఆ తర్వాత మరో రెండు చిత్రాల్లో నటించిన ధ్రువ్ అందులో ఒకదానిలో తన తండ్రి విక్రమ్ తో కలిసి నటించడం విశేషం. ఇక ‘బైసన్’తో మరోసారి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చే సబ్జెక్ట్‌తో రాబోతున్నాడని అర్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: