ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్..సీజ్ ఫైర్. ఈసినిమా గత సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సైతం వసూలు చేసుకుంది. ఇప్పుడు పార్ట్ 2 కూడా రాబోతుంది. శౌర్యాంగపర్వం పేరుతో ఈపార్ట్ రానుంది. మొదటి పార్ట్ సక్సెస్ అవ్వడం..దానికితోడు ఇంట్రెస్టింగ్ పాయింట్ తో క్లైమాక్స్ ను ముగించడంతో పార్ట్ 2 పై ఆసక్తిని నెలకొల్పారు. ఇక ఈసినిమా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాపై ఒక రూమర్ తెరపైకి వచ్చింది. ఒక వెబ్ సైట్ తమ ట్విట్టర్ లో ఈసినిమా గురించి మాట్లాడుతూ.. అన్ని డిస్ట్రిబ్యూటర్స్ కు ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టలేదని.. నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈసినిమా కేవలం 5వారాలు మాత్రమే ట్రెండింగ్ నిలిచింది..కానీ ఆర్ఆర్ఆర్ సినిమా 25 వారాలు ట్రెండింగ్ లో నిలిచిందని.. ఇంకా టెలివిజన్ లో కూడా ఈసినిమా తక్కువ రేటింగ్ న సొంతం చేసుకుందని పోస్ట్ చేశారు. దీంతో దీనిపై స్పందించిన చిత్రయూనిట్. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని..ఇలాంటి గాసిప్స్ ను నమ్మొద్దని.. ఈ సినిమా సక్సెస్ ను అందరం కలసి సెలబ్రేట్ చేసుకుందాం అంటూ క్లారిటీ ఇచ్చారు. మీ కల్పితాలను వాస్తవాలుగా చూపించడం ఆపండి అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
Fake news alert! Here’s the real scoop, #SalaarCeasefire is heading to Japan after winning hearts worldwide, including in Japanese! Don’t believe the gossip—let’s celebrate the film’s success together. Any thoughts on its growing international appeal, @GulteOfficial?
Also stop… https://t.co/bWea4ZgQ0s— Prasad Bhimanadham (@Prasad_Darling) May 5, 2024
ఇక ఇక్కడ హిట్ అయిన విదేశాల్లో రిలీజ్ చేయడం కూడా ఇప్పుడు కామన్ అయిన సంగతి తెలిసిందే కదా. అందులోనూ ప్రభాస్ కు బాహుబలి సిరీస్ తరువాత విదేశాల్లో ఏ రేంజ్ లో క్రేజ్ పెరిగిందో చూశాం. ఈనేపథ్యంలో ఈసినిమాను జపాన్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. జులై 5వ తేదీన ఈసినిమా జపాన్ లో రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: