మహర్షి రాఘవను ఘనంగా సత్కరించిన మెగాస్టార్

Megastar Felicitates Maharshi Raghava During His 100th Blood Donation at Chiranjeevi Blood Bank

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సీనియర్ నటుడు మహర్షి రాఘవను ఘనంగా సత్కరించారు. ఈ స‌న్మాన కార్య‌క్ర‌మంలో రాఘవ స‌తీమ‌ణి శిల్పా చ‌క్ర‌వ‌ర్తి, అలాగే మరో సీనియర్ నటుడు, నిర్మాత మురళి మోహన్ కూడా పాల్గొన్నారు. ఇంతకూ మెగాస్టార్ చిరంజీవి రాఘవను సత్కరించడానికి కారణం తెలిస్తే ఔరా! అనేక మానరు. మహర్షి రాఘవ ఇప్పటివరకూ 100 పర్యాయాలు ర‌క్త‌దానం చేయడం విశేషం. అది కూడా మెగాస్టార్ స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లోనే కావడం గమనార్హం. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిరంజీవి రాఘవను ఘనంగా సన్మానించారు. ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. తాను ఇంతవాడు కావడానికి సహకరించిన సమాజానికి తనవంతు బాధ్యతగా ఏదో ఒక మంచి చేయాలన్న తలంపులోనుంచి వచ్చిన ఆలోచనే ఈ బ్లడ్ బ్యాంక్‌ స్థాపించడానికి కారణమని తెలిపారు. 1998 అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించానని, ఈ సుదీర్ఘ ప్రయాణంలో తన అభిమానులతోపాటు ఎంతోమంది సహాయసహకారాలు అందించారని చెప్పారు. ఇక తన అభిమాని అయిన రాఘ‌వ 100 సార్లు రక్తదానం చేసిన వ్యక్తుల్లో మొదటివాడని, తాను చేసే మంచి పనిలో అతను ఇలా తోడుగా నిలవడం తనకి ఎంతో సంతోషాన్ని కలగజేస్తుందని చిరు పేర్కొన్నారు.

నాడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ ప్రారంభించినప్పుడు ర‌క్త‌దానం చేసిన తొలి వ్య‌క్తి నటుడు ముర‌ళీ మోహ‌న్‌ కాగా.. రెండో వ్య‌క్తి మ‌హ‌ర్షి రాఘ‌వ కావ‌డం విశేషం. ఈ సందర్భంగా.. నువ్వు 100వ సారి ర‌క్త‌దానం చేస్తున్నప్పుడు కచ్చితంగా నేను కూడా వస్తాను అని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారట. మెగాస్టార్‌ చిరంజీవిపై అభిమానంతో అప్పటినుంచి ఇప్పటివరకూ 3 నెల‌ల‌కు ఒకసారి చొప్పున మొత్తం 100 సార్లు రక్తదానం చేయడం విశేషం. అందుకే మెగాస్టార్ కూడా చెన్నైలో షూటింగ్ లో ఉన్నప్పటికీ ఈ విషయం తెలిసి రాఘవను అభినందించడానికి ప్రత్యేకంగా వచ్చారు. ఇక రాఘవ స‌తీమ‌ణి శిల్పా చ‌క్ర‌వ‌ర్తితో క‌లిసి ‘ఆప‌ద్బాంధ‌వుడు’ చిత్రంలో న‌టించిన సంద‌ర్భాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + ten =