ఆది సాయికుమార్ కొత్త సినిమా టైటిల్ ఖరారు

Aadi Saikumar's New Movie Titled as Krishna From Brindavanam

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ జయాపజయాలతో సంబంధం లేకుండా అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకు అల్లరి నరేష్ నటించిన ‘అహ నా పెళ్ళంట’ ఫేమ్ వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అందించింది చిత్ర యూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆది సాయికుమార్ హీరోగా నటించనున్న ఈ చిత్రం టైటిల్ ను అనౌన్స్‌ చేశారు. తాజాగా ఈ సినిమాకు ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. కాగా ఈ మూవీలో ‘హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా.. శ్యామ్ దూపాటి ఫోటోగ్రఫీ, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్, డ్రాగన్ ప్రకాష్ యాక్షన్ బాధ్యతలు నిర్వహించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 1 =