టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ ఎవరో చెప్పిన దిల్ రాజు

Producer Dil Raju Says, Megastar Chiranjeevi is The Family Star For Telugu Film Industry

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ  సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించగా.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శుక్ర‌వారం (ఏప్రిల్ 5, 2024) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు తాజాగా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో పాల్గొని చిత్ర విశేషాలను వివరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక స్టార్ ఉంటారని, అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం ఫ్యామిలీ స్టార్ అంటే, మెగాస్టార్ చిరంజీవే అని తేల్చి చెప్పారు. సాధారణ కుటుంబంలో పుట్టిన ఒక యువకుడు నటనపై ఆసక్తితో చెన్నై వెళ్లి, వేషాలకోసం ప్రయత్నించి సఫలమవడం చిరంజీవి గారి జీవితంలో చూడొచ్చని తెలిపారు. అలాగే చిన్న చిన్న వేషాలతో సినీ కెరీర్‌ను మొదలుపెట్టి.. విలన్‍గా, ఆపై హీరోగా చేస్తూ, తొలుత సుప్రీం హీరో అనిపించుకుని, ఆ తర్వాత మెగాస్టార్ అనిపించున్నారు” అని గుర్తు చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని చిరు అగ్ర కథానాయకుడి స్థానానికి చేరుకోవడం ఆయనకే చెల్లిందని కొనియాడారు. అలాగే ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తన ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. ఇలా ఇంతమంది స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారంటే, దానికి ప్రధాన కారణం కేవలం చిరంజీవేనని పేర్కొన్నారు. అందుకే ఆయన నిజమైన ఫ్యామిలీ స్టార్ అని కితాబిచ్చారు నిర్మాత దిల్ రాజు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.