కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

స్ట్రీమింగ్ లోకి రానున్న మంజుమ్మల్ బాయ్స్

Manjummel Boys Streaming on Hotstar from Tonight
ఓటీటీ1 ని. చదువు

స్ట్రీమింగ్ లోకి రానున్న మంజుమ్మల్ బాయ్స్

Manjummel Boys Streaming on Hotstar from Tonight

Manjummel Boys Streaming on Hotstar from Tonight
JioHotstarలో స్ట్రీమింగ్

మలయాళ ఇండస్ట్రీ హిట్ మంజుమ్మల్ బాయ్స్ ఈ రోజు రాత్రి 12గంటలనుండి స్ట్రీమింగ్ లోకి రానుంది. తెలుగుతోపాటు మలయాళ ,కన్నడ, తెలుగు, తమిళ ,హిందీ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి రానుంది.ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 230కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అత్యధిక వసూళ్లను రాబట్టిన మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది.అటు తమిళనాడు లో కూడా ఈ సినిమా అదరగొట్టింది. దాదాపు అక్కడ 50కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని ఆల్ టైం మలయాళ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.

ఇక ఈసినిమాను తెలుగులో అదే టైటిల్ తో గత నెలలో విడుదలచేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.దాదాపు 8కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక ఇప్పుడు ఈసినిమా ఓటిటిలోకి వస్తుంది.మరి ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

చిదంబరం డైరెక్షన్ లో వాస్తవిక సంఘటనల ఆధారంగా సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాలో శ్రీనాథ్ భాసి,బాలు వర్గీస్ ,గణపతి,దీపక్ పరంబోల్ ,సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటించగా సుషిన్ శ్యామ్ సంగీతం అందించాడు.బాబు షాహిర్ ,షాన్ ఆంటోనీ నిర్మించారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్