డబుల్ ఇస్మార్ట్ షురూ మళ్లీ  

Double ISMART to resume the shoot in Mumbai
సినిమాను తొందరగా పూర్తి చేసే దర్శకుల్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ముందువరుసలో వుంటాడు.ఆయన ఏ సినిమాకైనా మూడు,నాలుగు నెలల సమయం కంటే ఎక్కువ తీసుకోడు కానీ రామ్ తో తీస్తున్న డబుల్ ఇస్మార్ట్ విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. ఈసినిమా స్టార్ట్ చేసి తొమ్మిది నెలలకు వస్తున్న ఇంకా పూర్తి కాలేదు.తొందరగానే పూర్తి చేస్తామన్న కాన్ఫిడెన్స్ తో అనౌన్స్ మెంట్ రోజే రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు శివరాత్రి కి విడుదలచేస్తామని కానీ ఇంకా సగం షూటింగ్ బ్యాలెన్స్ వుంది.మధ్యలో అనివార్యకారణాల వల్ల షూటింగ్ స్టార్ట్ కాలేదు. 
 
ఇక ఎట్టకేలకు ఈసినిమాకు అడ్డంకులు తొలిగిపోయాయి.ముంబై లో ఈరోజు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.వీలైనంత తొందరగా బ్యాలెన్స్ షూట్ ను ఫినిష్ చేసి సినిమాను జులై లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఈసినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈసినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.  
 
పూరి మార్క్ మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈసినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్ ఫై పూరి జగన్నాథ్,ఛార్మి నిర్మిస్తున్నారు.ఈసినిమాకు ఇంకా హీరోయిన్ ఎవరనేది ప్రకటించాల్సి వుంది.ఇంతకుముందు రామ్,పూరి కాంబో లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో డబుల్ ఇస్మార్ట్ పై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా విజయం పూరి అలాగే రామ్ కు కీలకం కానుంది. 
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =