ట్రోల్స్‌పై అదిరిపోయే రిప్లై ఇచ్చిన దిల్ రాజు

Producer Dil Raju Responds Over The Trolls on His Personal Life

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ  సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించగా.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శుక్ర‌వారం (ఏప్రిల్ 5, 2024) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు తాజాగా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో పాల్గొని చిత్ర విశేషాలను వివరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దిల్ రాజు తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. ఎప్పుడైనా మీ గురించి ఏదైనా నెగటివ్ వార్తలు విన్నప్పుడు, ట్రోల్స్‌ జరిగినప్పుడు మీరు దానిని అధిగమించడానికి ఎలా ప్రయత్నం చేస్తారు? అని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. ట్రోల్స్‌ను తానెప్పుడూ సీరియస్‌గా తీసుకోనని, అవి జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ (తేలిపోయే మేఘాలు) వంటివని తెలిపిన ఆయన.. తాను మాత్రం ఆకాశంలాంటివాడినని పేర్కొన్నారు. ఇలాంటివి తన వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించవని స్పష్టం చేశారు.

ఇంకా దిల్ రాజు ఇలా మాట్లాడుతూ అన్నారు.. తెలుగు ప్రజలు దాదాపు 14 కోట్ల మంది ఉంటారని, అందులో తక్కువలో తక్కువ 1కోటి మంది వరకు తనను గుర్తుపడతారని దిల్ రాజు చెప్పారు. ఈ కోటిమందిలో మహా అయితే ఒక వెయ్యి, లేదా ఐదు వేలు, లేదా పదివేలమంది తనను విమర్శించడం అనేది సహజమేనని, అయితే మిగిలిన వారు తనపై అభిమానాన్ని చూపిస్తుంటారని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోసియేటిలో నెగటివ్ వైబ్స్ ఎక్కువగా ఉంటున్నాయని, సాధ్యమైనంతవరకు దీనికి దూరంగా ఉండాలని సూచించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.