సత్యదేవ్ కృష్ణమ్మ రిలీజ్ డేట్ వచ్చేసింది

Satyadev Kirshnamma movie release date fixed

మొదట హీరో ఫ్రెండ్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసినా ఆతరువాత పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించి.. ఆ తరువాత హీరోగా విభిన్నమైన పాత్రలు చేసి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్. వాటిలో కృష్ణమ్మ సినిమా కూడా ఒకటి. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కృష్ణమ్మ సినిమా వస్తుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా టీజర్ ను ఎప్పుడో రిలీజ్ చేశారు. టీజర్ మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి క్రేజీఅప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ ను తెలియచేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మే 3వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇంకా ఈసినిమాలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాలబైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + five =