రికార్డులు సృష్టించాలన్నా నేనే.. వాటిని తిరగరాయాలన్నా నేనే – బాలకృష్ణ

Nandamuri Balakrishna Attends Legend 10 Years Blockbuster Celebrations

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి ఇప్పటివరకు మూడు బ్లాక్ బస్టర్స్ అందించారు. వాటిలో ఒకటి ‘లెజెండ్’ చిత్రం. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించారు. 2014 మార్చి 28న విడుదలై ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లెజెండ్ 10 ఇయర్స్ పురస్కరించుకుని, మేకర్స్ మార్చి 30న సెన్సేషనల్ హిట్‌ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ వేడుకలని ఘనంగా నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ వేడుకకు హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా ఆయన అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. బాలకృష్ణ ఏమన్నారో, ఆయన మాటల్లోనే.. “నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, కారణజన్ముడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నా గురువు, నా దైవం, నా కన్నతండ్రికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎల్లుండి ఈ సినిమా రీరిలీజ్ అవుతుంది. మళ్ళీ వందరోజుల పండగ జరుపుకుంటాం. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి గారికి శుభాకాంక్షలు అభిమానులకు, తోటికళాకారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను”.

“తెలుగు సినిమాల ప్రభావం యావత్ దేశానికి పాకిందంటే దాని ప్రభావం ఎంత వుందో కళ్ళముందు కనిపిస్తోంది. సినిమా రికార్డులు నాకు కొత్త కాదు. రికార్డులు సృష్టించాలన్నా నేనే. వాటిని తిరగరాయాలన్నా నేనే. నా దర్శకులు, కథ ఎంపిక, తోటి నటులు, సాంకేతిక నిపుణులు మీద నాకు గట్టి నమ్మకం. ‘సమరసింహారెడ్డి’ 30 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ చేసుకొని దేశంలో కొత్త రికార్డులు సృష్టించింది. 105 కేంద్రాలలో 100 రోజులు ఆడిన సినిమా ‘నరసింహ నాయుడు’. 400 రోజులు నాలుగు ఆటలతో రెండు కేంద్రాలలో ఆడి ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డ్‌గా నిలిచిన సినిమా ‘లెజెండ్’. అలాగే నాలుగు ఆటలతో 1116 రోజులు ఆడి నాలుగు అంకెల రోజులుని దాటిన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా లెజెండ్”.

“సినిమా కేవలం వినోదానికే కాదు సినిమా అంటే ఒక బాధ్యత. నా ప్రతి సినిమాను సమాజం పట్ల స్పృహ, ఒక చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథలు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ‘లెజెండ్‌’లో మహిళలను ఉద్దేశించి ఇచ్చిన అద్భుతమైన సందేశం వుంది. ఇటివలే వచ్చిన నేలకొండ ‘భగవంత్ కేసరి’లో కూడా చాలా చక్కని సందేశం ఇచ్చాం. కళామతల్లి, నా తల్లితండ్రుల, అభిమానుల ఆశీస్సులు వుండబట్టే ఇలాంటి మంచి సినిమాలు చేయగలుతున్నానని భావిస్తున్నాను. చలన చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో చెప్పుకోదగ్గ సినిమా ‘లెజండ్’. సింహా, లెజెండ్, అఖండ, నేలకొండ భగవంత్ కేసరి.. ఈ చిత్రాలన్నీ తృప్తిని ఇవ్వడంతో పాటు ఇంకా మంచి సినిమాలు చేయాలనే కసి పెంచాయి”.

“2014 ఎలక్షన్స్ కి ముందు లెజెండ్ విడుదలైయింది. దాని ప్రభావం ఎన్నికలపై ఎంత వుందో మనకి తెలుసు. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. యాదృచ్ఛికంగా సినిమా మళ్ళీ విడుదల కాబోతుంది. సినిమా ఎంత ప్రభావం వుంటుందో రేపు ఎన్నికల్లో చూడబోతున్నారు. జయం మనదే. దర్శకులు బోయపాటి గారు, నేను ఒక సినిమా చేస్తున్నపుడు మరో సినిమా గురించి అలోచించము. రేపు జరబోయే సినిమా గురించి కూడా మాట్లాడుకోం. మేము మాటల మనుషులం కాదు. చేసి చూపిస్తాం. మా ఆలోచనలు ఒకటే. రామ్ ప్రసాద్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ ఆణిముత్యాలు లాంటి పాటలు సమకూర్చారు”.

“సోనాల్ చౌహాన్ అందం అభినయంతో ఆకట్టుకున్నారు. అలాగే రాధిక ఆప్టే గారు కూడా చక్కని అభినయం కనబరిచారు. జగపతి బాబు గారు తన పాత్రలో చాలా అద్భుతంగా రాణించారు. మిగతా నటీనటులంతా వారి పాత్రలలో ఒదిగిపోయారు. లెజెండ్ మళ్ళీ విడుదల కావడం చాలా సంతోషంగా వుంది. మా అబ్బాయి తరమే కాదు నా మనవడి తరంకు కూడా నేను కనెక్ట్ అయినందుకు, నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన కళామాతల్లికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‍కు చైర్మన్‌గా.. ఇలా ఇన్ని పాత్రలు పోషిస్తూ వాటికి న్యాయం చేస్తున్నా. లెజెండ్‌ని అప్పుడు అంత విజయం చేసినందుకు, రేపు చేయబోతునందుకు అభిమానులకు, ప్రేక్షకులకు, తెలుగు చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు’’ అని తెలిపారు నందమూరి బాలకృష్ణ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 9 =