టాలీవుడ్ హీరో నితిన్ ఇటీవలే ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈసినిమా సరైన విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మార్చి 30వ తేదీన నితిన్ పుట్టినరోజు కావడంతో ఈసినిమా నుండి స్పెషల్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The conman’s birthday calls for a special update 😎#Robinhood‘s new avatar on March 30th 💥💥
Stay tuned!
@actor_nithiin @VenkyKudumula @gvprakash @MythriOfficial #TeluguFilmNagar pic.twitter.com/zacHenb8T1— Telugu FilmNagar (@telugufilmnagar) March 29, 2024
కాగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























