జివి ప్రకాష్ ఐశ్వర్య రాజేష్ డియర్ రిలీజ్ డేట్ ఫిక్స్

gv prakash and aishwarya rajesh starrer dear movie telugu release date fixed

ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘డియర్’. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేయగా రెండు పాటలూ చార్ట్‌లలో ఆదరగొడుతున్నాయి. త్వరలో తెలుగులో కూడా విడుదల కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా తెలుగు రిలీజ్ డేట్ పై కూడా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తమిళ వెర్షన్ ఏప్రిల్ 11న విడుదల కానుండగా, తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ సినిమా ఆంధ్రా థియేట్రికల్ హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ కొనుగోలు చేయగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రాండ్ గా విడుదల కానుంది.

కాగా ఈసినిమాలో ఇంకా డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మిస్తుండగా.. జగదీష్ సుందరమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + fourteen =