టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన నటించిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘డీజే టిల్లు’కి మించిన వినోదాన్ని అందించడానికి ‘టిల్లు స్క్వేర్’ చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ కొల్లి, బొమ్మరిల్లు భాస్కర్, వెంకీ అట్లూరి, నీరజ కోన ముఖ్య అతిథులుగా హాజరై ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇక సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక అభిమానుల కోలాహలం నడుమ ఆద్యంతం ఆహ్లదకరంగా సాగింది. నటీనటులు మురళీధర్, ఆంథోనీ, సుజాత, సంగీత దర్శకులు రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో, గీత రచయిత కాసర్ల శ్యామ్, సినిమాటోగ్రాఫర్ సాయి ప్రకాష్, ఎడిటర్ నవీన్ నూలి, గాయకుడు శ్రీరామ్ చంద్ర, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసిన వెంటనే నేను సిద్ధుకి కాల్ చేసి మాట్లాడాను. 12-13 ఏళ్ళ క్రితం నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి సిద్ధు నాకు పరిచయం. ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడో నాకు తెలుసు. ఈ అభిమానానికి, స్టార్ బాయ్ ట్యాగ్‌కి నువ్వు అర్హుడివి. అప్పట్లో రాజేంద్రప్రసాద్ గారి సినిమాలు పెద్ద హీరోల సినిమాల స్థాయిలో వసూళ్లు రాబట్టేవి. ఈ తరంలో సిద్ధు ఆ స్థానాన్ని భర్తీ చేయాలని కోరుకుంటున్నాను. అన్ని జానర్ సినిమాలు చేస్తూ సిద్ధు మరింత ఎదగాలి అని కోరుకుంటున్నాను. నాకు ట్రైలర్‌లో “నేను పెంచలే.. వాడే పెరిగిండు” అనే డైలాగ్ బాగా నచ్చింది. దర్శకుడు మల్లిక్ రామ్ గారికి, నిర్మాత నాగవంశీ గారికి, రామ్ మిరియాల గారికి టీం అందరికీ ఆల్ ది బెస్ట్” అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: