వచ్చేే ఏడాది సంక్రాంతి బరిలోకి కాంతార ఛాప్టర్1 ?

crazy update on Kantara Chapter 1 Movie release

రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా కాంతార. ఈసినిమా కన్నడలో ఎలాంటి అంచనాలు లేకుండానే బాక్సాఫీస్ బరిలో దిగింది. కానీ అక్కడ ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈసినిమా అన్ని భాషల్లో కలిపి దాదాపు 500 కోట్ల వరకూ కలెక్ట్ చేసుకుంది. ఇక ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. కాంతార కథ మొదలు కావడానికి ముందు ఏం జరిగింది అనే దాని దగ్గర నుంచి ఈ కథ మొదలవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా రిలీజ్ పై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకు తగినట్టుగానే అన్నింటినీ ప్లాన్ చేసుకుంటున్నారట మేకర్స్. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఈసినిమాను కూడా రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయనున్నాడు. భారీ బడ్జెట్ తో హోంబల్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తుండగా.. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు ఈసినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం తో పాటు హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ కూడా రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 15 =