బయట నన్ను టిల్లు అన్న అని పిలుస్తున్నారు – సిద్ధు జొన్నలగడ్డ

Fans Calling Me as Tillu After DJ Tillu, Says Siddhu Jonnalagadda

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం యువత మరియు సినీ ప్రియుల్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలో సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘డీజే టిల్లు’కి మించిన వినోదాన్ని అందించడానికి ‘టిల్లు స్క్వేర్’ చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ కొల్లి, బొమ్మరిల్లు భాస్కర్, వెంకీ అట్లూరి, నీరజ కోన ముఖ్య అతిథులుగా హాజరై ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇక సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక అభిమానుల కోలాహలం నడుమ ఆద్యంతం ఆహ్లదకరంగా సాగింది. నటీనటులు మురళీధర్, ఆంథోనీ, సుజాత, సంగీత దర్శకులు రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో, గీత రచయిత కాసర్ల శ్యామ్, సినిమాటోగ్రాఫర్ సాయి ప్రకాష్, ఎడిటర్ నవీన్ నూలి, గాయకుడు శ్రీరామ్ చంద్ర, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ..”డీజే టిల్లు అనేది యువతని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. కానీ సినిమా విడుదలైన తర్వాత కుటుంబ ప్రేక్షకులకు, అందునా ముఖ్యంగా ఆడవాళ్లకు, చిన్న పిల్లలకు టిల్లు పాత్ర బాగా నచ్చడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. టిల్లు పాత్రని ప్రేక్షకులు హృదయాల్లో పెట్టుకున్నారు. నన్ను సిద్ధు కంటే కూడా ఎక్కువగా టిల్లు అనే పిలుస్తున్నారు. బయట ఎక్కడైనా కనిపిస్తే టిల్లు అన్న అంటూ ప్రేమగా పిలుస్తుంటారు. అందుకే సీక్వెల్ అంటే మొదట కాస్త భయపడ్డాను. కానీ ఒక్కటే అనుకున్నాను. మొదటి పార్ట్ లా ఉండకూడదు, కానీ అదే స్థాయిలో వినోదాన్ని పంచాలి. అలాగే టిల్లు పాత్రలో ఉన్న సోల్ మిస్ అవ్వకూడదు. హీరోయిన్ పాత్ర కూడా మొదటి పార్ట్ లాగే బాగా ఫేమస్ అవ్వాలి. ఇలా అన్నీ దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నాము. అయినా మొదట కాస్త భయపడ్డాము” అని చెప్పారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “యుద్ధం గెలుస్తామో లేదో మన చేతుల్లో ఉండదు.. కానీ పోరాటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అది నమ్మే మా టీం అంతా టిల్లు స్క్వేర్ కోసం శాయశక్తులా కృషి చేశాం. ఫైనల్ అవుట్ పుట్ చూసుకున్నాక మాకు సంతృప్తి కలిగింది. అలాగే ఈ సినిమా విషయంలో నేను కొందరికి థాంక్స్ చెప్పాలి. ముందుగా మ్యాడ్ చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. నేను, కళ్యాణ్, ఆంథోనీ, మల్లిక్ కలిసి ఈ సినిమా రాశాము. కళ్యాణ్ మాకు చాలా హెల్ప్ చేశాడు. అలాగే ఎడిటర్ నవీన్ నూలి గారికి, డీటీఎస్ ఇంజనీర్ రాధాకృష్ణ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. అందరికంటే ముఖ్యంగా మా నిర్మాత నాగవంశీ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు” అని తెలిపారు.

“మాకు అండగా నిలిచిన చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి చాలా చాలా థాంక్స్. సినిమా కొన్నిసార్లు మాకు అర్థమైన దానికంటే.. త్రివిక్రమ్ గారికి ఎక్కువ అర్థమై మాకు ఎంతో సాయం చేశారు. భీమ్స్ సిసిరోలియో గారి నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. టిల్లు లో మాస్ ని తన సంగీతంతో ఇంకా ఎక్కువ తీసుకొచ్చారు. మార్చి 29న థియేటర్లలో చాలా చాలా నవ్వబోతున్నారు. చాలా థ్రిల్స్, షాక్ లు, సర్ ప్రైజ్ లు ఉంటాయి. మాస్ క్లైమాక్స్ ని చూడబోతున్నారు. టిల్లు స్క్వేర్ మీ అంచులను ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. తాజాగా నేను, అనుపమ కలిసున్న పోస్టర్ విడుదల చేసినప్పుడు.. కొందరు నెగటివ్ కామెంట్స్ రాశారు. అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను” అని సిద్ధు జొన్నలగడ్డ అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 13 =