దుబాయ్‌లో ఘనంగా అల్లు అర్జున్‌ విగ్రహావిష్కరణ, ఫొటోస్ వైరల్

Allu Arjun's Wax Statue Unveiled at Madame Tussauds Museum at Dubai

మరో తెలుగు హీరోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇప్పటికే ఎంతోమంది హీరోలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగా.. తాజాగా ఆ జాబితాలో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ చేరారు. దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక ‘మేడమ్‌ టుస్సాడ్స్‌’ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా ఈ గౌరవాన్ని అందుకున్న తొలి తెలుగు హీరోగా మాత్రమే కాకుండా.. ఈ ఘనత సాధించిన మొదటి దక్షిణాది నటుడిగా కూడా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించారు. ఇప్పటికే నేషనల్ బెస్ట్ యాక్టర్‌ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా ఆయన రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గురువారం (మార్చి 28, 2024) రాత్రి అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో.. దుబాయ్‌లోని ‘మేడమ్‌ టుస్సాడ్స్‌’ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ‘పుష్ప-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌.. కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని సందడి చేశారు. కాగా ఈ విగ్రహం అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ఐకానిక్ సన్నివేశం బోర్డు మీటింగుకు హాజరైన సందర్భంలోని ఎరుపు రంగు సూట్‌లో ఉంది. అలాగే పుష్ప మూవీలో ‘తగ్గేదే లే’ అంటూ గడ్డం కింద చేయి పెట్టి చెప్పే స్టిల్‍ని జోడించారు.

ఇక చూడటానికి అచ్చం తనలాగే కనిపిస్తున్న ఈ విగ్రహాన్ని.. అల్లు అర్జున్ ఆసక్తిగా గమనించారు. ఈ విగ్రహం పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఇప్పటికే మన స్టార్ హీరోలు ప్రభాస్‌ మరియు మహేష్‌ బాబు మైనపు విగ్రహాలు కొలువుదీరాయి. కానీ ఇవి లండన్ లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఉన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ విగ్రహాన్ని దుబాయ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేయడం గమనార్హం.

ఇక్కడ విశేషం ఏంటంటే..? ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలోని చిత్ర పరిశ్రమలకు చెందిన ఏ ఒక్క నటుడికి సంబంధించిన విగ్రహానికి కూడా ఈ మ్యూజియంలో చోటుదక్కలేదు. తొలిసారిగా అల్లు అర్జున్‌ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం. దీంతో ఈ ఘనత సాధించిన తొలి సౌత్ హీరోగా ఆయన నిలిచారు. దీనితోపాటు దుబాయ్‌ గోల్డెన్‌ వీసా అందుకున్న తొలి తెలుగు హీరో కూడా ఆయనే కావడం విశేషం. అయితే ఇప్పటికే ఈ మ్యూజియంలో బాలీవుడ్‌ నుంచి స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ విగ్రహాలు ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + thirteen =