టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం సినిమా జయాపజయాలతో పనిలేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా మంచి హిట్ ను అందించింది. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. చైతన్య కృష్ణ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక రీసెంట్ గానే కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మే 17వతేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా విశ్వక్ లిస్ట్ లో ఇంకా పలు సినిమాలు ఉన్నాయి. అందులో రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా కూడా ఉంది. ఇది విశ్వక్ సేన్ 10వ సినిమా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. ఇన్ని రోజులూ 10 అనే టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెకానిక్ రాకీ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది. పోస్టర్ ను బట్టి విశ్వక్ సేన్ మరోసారి మాస్ పాత్రలో అలరించడానికి వచ్చేస్తున్నట్టు అర్థమవుతుంది.
Time to fasten your seat belts. #MechanicRocky is here, to take you on a ride 💥🛠
Wishing our ‘Mass ka Das’ @VishwakSenActor a very Happy Birthday#HBDVishwaksen@itsRamTalluri @Meenakshiioffl @RaviTejaDirects @JxBe @SRTmovies @manojhreddydop @anwaraliedit @SonyMusicSouth pic.twitter.com/8MMFdnl5o8
— Ram Talluri (@itsRamTalluri) March 29, 2024
కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న సనిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా.. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
![Video thumbnail](https://img.youtube.com/vi/nbM644o5Bg4/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/zDC2MGBeNZc/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/5OW2h1GhBeU/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/_O-kzHI3AYg/default.jpg)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)