మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా సతీమణి ఉపాసనతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్న రామ్ చరణ్, ఉపాసనలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చరణ్ దంపతులు కుమార్తె క్లీన్ కారాతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక స్వామివారి దర్శనానంతరం రామ్ చరణ్, ఉపాసన మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత ప్రధాన ఆలయానికి సమీపంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులతో ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ క్రమంలో చరణ్ దంపతులకు శ్రీవారి చిత్రపటం మరియు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మెగా ప్రిన్సెస్ ఫేస్ రివీల్..
ఇక ఇదిలావుండగా.. నెట్టింట వైరల్ అవుతోన్న ఒక వీడియోలో మెగా ప్రిన్సెస్ క్లీన్ కారా ముఖం రివీల్ కావడం విశేషం. క్లీన్ కారా జన్మించి 9 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ తన ఫేస్ ఎక్కడా కనిపించకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అనుకోకుండా ఇప్పుడు క్లీన్ కారా పేస్ రివీల్ కావడంతో మెగా అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. మెగా ప్రిన్సెస్ చాలా క్యూట్‌గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా రామ్‌చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ‘జరగండి’ అనే పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. త్వరలోనే ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక తదుపరి చిత్రంగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘ఆర్‌సీ16’ (వర్కింగ్ టైటిల్) అనే మూవీలో చరణ్ నటించనున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: