సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా హిట్ టాక్ ను అయితే సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ మాస్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఓటీటీలో కూడా సందడి చేస్తున్న చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పుడు గుంటూరు కారం ఓటీటీ రెస్పాన్స్ పై నాగవంశీ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ సినిమాలో లాజిక్ ల సంగతి పక్కన పెడితే గుంటూరు కారం ఫ్యాన్స్ కు చాలా బాగా నచ్చిందని అన్నారు. ఇప్పుడు ఓటీటీలో వచ్చాక చాలా మంది సినిమా చాలా బావుందని చెప్పారు.. థియేటర్ రిలీజ్ తరువాత ఇంకా ఓటీటీలో వచ్చిన తర్వాత రెండు డిఫరెంట్ టాక్ లు వచ్చాయి.. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఎంతో అనుభవం ఉన్న త్రివిక్రమ్ లాంటి దర్శకుడు నుంచి మేము ఖచ్చితంగా మంచి సినిమానే ఇచ్చామని మరోసారి స్పష్టం చేశారు.
కాగా ఈసినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటించగా రమ్యకృష్ణ ,ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. థమన్ సంగీతం అందించిన ఈసినిమాను..హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: