గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఈసినిమా.. దానికి తోడు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఆ అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అంతేకాదు సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకున్నట్టే తెలుస్తుంది. ఇటీవలే విశాఖపట్టణంలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ జరగండి పాటను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా పాట రిలీజ్ టైమ్ ను ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు. ఈపాట రేపు అంటే మార్చి 27వ తేదీన ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Ladies and gentlemen 🕺
Get your dancing shoes on for the MEGA MASS BLAST! 💥#Jaragandi will be out tomorrow at 9AM ❤️#GameChanger
Megapower Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @MusicThaman @DOP_Tirru @artkolla @SVC_official @ZeeStudios_ @zeestudiossouth… pic.twitter.com/xCkIUPsGei— Sri Venkateswara Creations (@SVC_official) March 26, 2024
కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: