రాజా సాబ్ విజువల్ వండర్ గా ఉంటుంది

producer tg vishwa prasad interesting comments on raja saab movie

రీసెంట్ గా సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇక దీనితో పాటు మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. సంక్రాంతి పండుగ సందర్భంగానే ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాకు రాజాసాబ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా మొదలుపట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా గురించి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టీజీ విశ్వప్రసాద్ తమ బ్యానర్ లో వస్తున్న సినిమాల గురించి చెబుతూ రాజా సాబ్ సినిమా గురించి కూడా ప్రస్తావించారు. రాజా సాబ్‌ సినిమా విఎఫ్‌ఎక్స్ భారీ స్థాయిలో ఉంటుందని.. అలానే బిగ్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాతో బిజీగా ఉన్నారు.. ఆసినిమా రిలీజ్ అయిన తర్వాత ది రాజా సాబ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తామని తెలిపారు.

కాగా ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈసినిమాకు సంగీతం అందించనున్నారు. కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్ గా.. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా.. ఈ సినిమాకు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =