మ్యాడ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్.గత ఏడాది వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది.కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.ప్రస్తుతం ఈసినిమాకు సీక్వెల్ రెడీ అవుతుంది.అయితే మ్యాడ్ సోలో హీరో సినిమా కాదు నితిన్ తోపాటు మరో ఇద్దరు టైటిల్ రోల్స్ లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నితిన్ సోలో హీరోగా నటించిన సినిమా ఆయ్.మేం ఫ్రెండ్స్ అండి అనేది ట్యాగ్ లైన్.గోదావరి బ్యాక్ డ్రాప్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతుంది.అంజి కె మణిపుత్ర డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో నయన్ సారిక హీరోయిన్.షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయినట్లే.ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసింది ఆయ్ టీం.అందులో భాగంగా ఈసినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
ఇక అందరి గుండెల్లోనూ…సూఫీయానా..😍
Presenting the most “Lovable Melody of the Season” #Sufiyana from #AAYMovie ❤️✨️
A @Ram_Miriyala Musical 🎹#AAY #AlluAravind #BunnyVas #VidyaKoppineedi @NarneNithiin @UrsNayan @GA2Official #AnjiKManiputhra… pic.twitter.com/f4ZZyyY2i3
— Geetha Arts (@GeethaArts) March 20, 2024
సూఫీయానా అంటూ వచ్చిన ఈ మెలోడీ సాంగ్ బాగుంది.రిపీట్ వాల్యూ వున్న సాంగ్ కావడంతో ప్లే లిస్ట్ ను రూల్ చేయడం ఖాయం.రామ్ మిర్యాల వాయిస్ పాటకు ప్రాణం పోసింది.ఈసినిమాకు తనే సంగీతం కూడా అందిస్తున్నాడు.ప్రముఖ రచయిత శ్రీమణి లిరిక్స్ అందించాడు.ఇక విజువల్స్ కూడా కూల్ గా వున్నాయి.ముఖ్యంగా నితిన్ లుక్ బాగుంది.గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్,విద్యా కొప్పినీడి ఈసినిమాను నిర్మిస్తున్నారు.ఏప్రిల్ లేదా మేలో ఆయ్ రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: