ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి.ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎంతోకాలంగా ఎదురుచూసిన ఈసినిమా ఫైనల్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. ముందునుండీ ప్రశాంత్ వర్మ చెప్పినట్టే ఈసినిమా రిలీజ్ అయిన 60 రోజుల తరువాత కానీ ఓటీటీలోకి విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5 లో ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక అలా ఓటీటీలోకి వచ్చిందో లేదో ఓటీటీ లో కూడా రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. ఈసినిమా ఓటీటీ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో ఈసినిమాకు ఓటీటీలో వస్తున్న రెస్పాన్స్ ను బట్టి అర్థమవుతుంది. ఈసినిమా ఓటీటీ లోకి రిలీజ్ అయిన 11 గంటల లోపే 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంది టాప్ 1లో ట్రెండింగ్ లో నిలిచింది.
Breaking Records & Winning Hearts ❤️#HanuMan Trending #1 Globally with 102MILLION+ Streaming Minutes in less than 11 hours on @ZEE5India 🔥#HanuManOnZEE5 💥@PrasanthVarma @tejasajja123 @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @GowrahariK @Chaitanyaniran… pic.twitter.com/InIE5D43CA
— Primeshow Entertainment (@Primeshowtweets) March 18, 2024
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: