మహేష్ బాబు సినిమాపై అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన రాజమౌళి

Rajamouli Gives Interesting Update About His Next Film with Mahesh Babu

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ సినిమాను ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా రాజమౌళి ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. జపాన్‌లో అయితే ఈ చిత్రం రిలీజై 500 రోజులకుపైనే అవుతున్నా.. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా నడుస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో రాజమౌళి ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ దేశం వెళ్లారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా అక్కడివారు రాజమౌళి తదుపరి చిత్రం గురించి ప్రశ్నించారు. నెక్స్ట్ మూవీ ఎలా ఉంటుంది? ఇందులో హీరో ఎవరు?వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటిపై స్పందించిన ఆయన ఇలా బదులిచ్చారు. తన తదుపరి చిత్రం పాన్ వరల్డ్ మూవీగా రూపొందించనున్నానని చెప్పారు. అలాగే ఇందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే స్టోరీ రాయడం పూర్తయిందని, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఇంకా నటీనటుల ఎంపికను పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు. సినిమా కోసం ప్రీవిజువలైజేషన్ చేస్తున్నామని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నామని తెలియజేశారు.

కాగా రాజమౌళి మహేష్ గురించి చెప్తూ.. మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడని, సినిమా రిలీజ్ సమయంలో ఆయనను ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేస్తానని పేర్కొనడం గమనార్హం. కాగా మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రానున్న ఈ మూవీని ప్రస్తుతానికి #ఎస్‌ఎస్‌ఎంబీ29 అనే వర్కింగ్ టైటిల్ తో వ్యవహరిస్తున్నారు. ఆయన నటిస్తోన్న 29వ సినిమా కానుండటంతో తాత్కాలికంగా ఈ టైటిల్ పెట్టారు. ఈ పాన్ గ్లోబల్ అడ్వెంచర్ యాక్షన్ సినిమా కోసం మహేష్ బాబు కొన్నిరోజుల క్రితం స్పెషల్ ఫిట్‍నెస్ ట్రైనింగ్ తీసుకోవడానికి జర్మనీకి వెళ్లి వచ్చారు. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందుతుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి రాజమౌళి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =