టిల్లు స్క్వేర్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది

producer naga vamsi interesting comments on tillu square movie

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది డీజే టిల్లు సినిమా. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈసినిమాలోని డైలాగ్స్, సాంగ్స్, టిల్లు యాటిట్యూడ్ అన్నీ సినిమాకు హైలెట్ నిలిచి సంచలన విజయం అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా సిద్దూ నటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు నిర్మాత నాగవంశీ. ఈసినిమాలోని ఓ మై లిల్లీ అనే పాటను తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ పాట లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న నాగవంశీ ఈసినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీజే టిల్లు కి ఎక్కువగా యూత్ కనెక్ట్ అయ్యారు అయితే ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అయిన తరువాత మాత్రం ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.. అంతేకాదు థియేటర్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నాం, ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ లో ఎంజాయ్ చేసేలా ఈ మూవీని తెరకెక్కించామని తెలిపారు.

కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా..సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =