రాజా సాబ్ కోసం రెడీ అవుతున్న ప్రభాస్

prabhas readying for raja saab movie shooting

రీసెంట్ గా సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మే 9వ తేదీన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు ఆదిశగానే పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనితో పాటు మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రాజా సాబ్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కల్కి సినిమా షూటింగ్ దాదాపు పూర్తవ్వడంతో రాజాసాబ్ షూట్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఈసినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడట.

కాగా ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈసినిమాకు సంగీతం అందించనున్నారు. కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్ గా.. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా.. ఈ సినిమాకు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =