విజయ్ దేవరకొండ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ముందుగా రాబోతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి కారణం గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం సినిమానే. ప్రస్తుతం అయితే చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటూనే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా నుండి పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే కదా. కళ్యాణి వచ్చా వచ్చా అంటూ వచ్చే ఈపాట ప్రోమోను ఈరోజు ఉదయాన్న రిలీజ్ చేశారు. ప్రోమోకే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వెడ్డింగ్ సాంగ్ లా ఉన్న ఈపాట అయితే కలర్ ఫుల్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. సినిమాలో విజయ్, మృణాల్ పెళ్ళిలో ఈ పాట వస్తుందని తెలుస్తుంది. మంగ్లీ, కార్తీక్ పాడిన ఈపాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు.
#FamilyStar second single, the dreamy & energetic #KalyaniVacchaVacchaa out now ❤️🔥
▶️ https://t.co/D9uchkTVN2#FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @Singer_Karthik #Mangli #AnanthaSriram @SVC_official @TSeries… pic.twitter.com/YDTTqK0P6f
— Sri Venkateswara Creations (@SVC_official) March 12, 2024
కాగా ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: