ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు వీడియోలను రిలీజ్ చేయగా అవి ఏరేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. మే 9వ తేదీన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు ఆదిశగానే పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. ఈనేపథ్యంలో ఇటలీలో ఆటాపాటా అంటూ చిత్రయూనిట్ ఒక ఫొటోను కూడా షేర్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Italy lo aata paata 🕺🏻💃🏻 #Kalki2898AD pic.twitter.com/BeksFQgekV
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) March 6, 2024
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: