అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న సినిమా వార్2. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా వచ్చిన వార్ సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి విదితమే. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు. ముంబైలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మే20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈసినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు. 2025 ఇండిపెండెన్స్ సందర్భంగా ఆగష్ట్ 14వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























