మ్యాచో హీరో గోపిచంద్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం భీమా.శివరాత్రి రోజు విడుదలవుతుంది.అందులో భాగంగా సెన్సార్ పూర్తి చేసుకుంది.ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.ఫైట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సర్టిఫికెట్ వచినట్లు తెలుస్తుంది.ఇక రన్ టైం విషయానికి వస్తే 143 నిమిషాల 43 సెకండ్ల్ నిడివి తో థియేటర్లోకి రానుంది.ఈసినిమాపై గోపిచంద్ సూపర్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.భీమా విజయం తన కెరీర్ కు కీలకం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.కన్నడ దర్శకుడు హర్ష ఈసినిమాను డైరెక్ట్ చేయగా మాళవిక శర్మ,ప్రియా భవాని శంకర్ హీరోయిన్లు గా నటించారు.రవి బస్రుర్ సంగీతం అందించగా సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మించాడు.
ఇక భీమా కు గట్టి పోటీఎదురుకానుంది ఎందుకంటే మార్చి 8న విశ్వక్ సేన్ గామి అలాగే మలయాళంలో విడుదలై బ్లాక్ బాస్టర్ అయిన ప్రేమలు విడుదలకానున్నాయి.ఈరెండు సినిమాలకు కూడా మంచి హైప్ వుంది దాంతో పోటీ ఆసక్తిగా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: